ప్రియుడి మోజులో పడి.. ఓ మహిళ తన కన్న కొడుకునే చంపాలనకుంది. ఈ దారుణ సంఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. జిల్లాలోని జులైవాడలో కన్న కొడుకుపై తల్లి కర్కశత్వంగా ప్రవర్తించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జులైవాడలో ఉంటున్న ఓ మహిళ.. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తమ శృంగార సరసాలకు.. కన్నకొడుకు అడ్డుగా ఉన్నడనే కోపంతో..ప్రియుడితో కలిసి కన్న తల్లే కొడుకును చిత్ర హింసలు పెట్టింది.
వారి చిత్రహింసలకు తాళలేక బాలుడు పెద్దగా కేకలు పెట్టాడు. దీంతో చుట్టుప్రక్కల వారు బాలుడి అరుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని.. బాలుడిని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.