
రాను రాను.. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతోంది.. వావి వరస లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలు.. వివాహేతర సంబంధం కారణంగా భార్యను భర్త చంపడం.. భర్తను భార్య చంపడం..పిల్లలను తల్లిదండ్రులే చంపడం వంటి దారుణాలు ఎక్కువైపోతున్నాయి.. జగిత్యాలలో ఓ తల్లి కర్కశత్వం చుస్తే.. ఇంతకీ ఈమె తల్లేనా అన్న అనుమానం రాక మానదు.. అమ్మతనానికే మచ్చ తెచ్చే విధంగా కన్నకొడుకును చితకబాదింది ఓ ట్ తల్లి. సోమవారం ( ఏప్రిల్ 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
జగిత్యాల పట్టణంలోని తులసి నగర్ లో జరిగింది ఈ ఘటన. తులసినగర్ లో తన చిన్నారి కొడుకుతో నివాసం ఉంటోంది రమ అనే మహిళ. ఆమె భర్త ఆంజనేయులు దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రమ తన కొడుకును రోజూ తీవ్రంగా కొట్టేది.. కొడుకును గొడ్డును బాదినట్టు బాదేది రమ.. ఇది గమనించిన స్థానికులు రామ కర్కశత్వాన్ని వీడియో తీసి సఖి సెంటర్ కు ఫిర్యాదు చేశారు.
స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అధికారులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తల్లి కొడుకు సఖి సెంటర్లో ఉన్నట్లు తెలిపారు అధికారులు. నిత్యం పిల్లాడిపై తల్లి దాష్టీకాన్ని భరించలేక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు స్థానికులు.
— Prashanth (@itzmibadboi) April 28, 2025