
భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి చెందిన గూళ్ల లక్ష్మీ, సమ్మయ్య దంపతుల కొడుకు రాకేశ్ పుట్టుకతోనే వికలాంగుడు. కాగా, కండరాల క్షీణత వ్యాధి పోరాడుతున్నాడు. కొడుకు అలా ఉన్నాడని కుమిలిపోకుండా తల్లి కొడుకును చదువుకోవాలని ప్రోత్సహించింది.
స్కూల్, కాలేజీ దాకా చెప్పించింది. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో ఫస్టియర్ చదువుతున్న తన కొడుకును ముల్కనూర్లోని సెంటర్ వద్దకు ఎత్తుకుని వచ్చింది. తల్లి ఆత్మవిశ్వాసం ముందు కొడుకు అంగవైకల్యం ఓడిపోయిందని అక్కడకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ముచ్చటించుకున్నారు.