కూతురు మాట వినలేదని తల్లి ఆత్మహత్య..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన

కూతురు మాట వినలేదని తల్లి ఆత్మహత్య..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘటన

గోదావరిఖని, వెలుగు: కూతురు తన మాట వినలేదని తల్లి ఆత్మహత్య చేసుకుంది.  వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్​నగర్​కు చెందిన ఎండీ సాజిదా(42)కు కూతురు సానియా, కొడుకు ఉన్నారు. భర్త గౌస్​ఖాన్​తో గొడవ పడి తల్లి మౌలానాబీ వద్ద ఉంటోంది. అయితే కూతురు సానియాకు నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా, ఇటీవల ఆయనతో గొడవపడి ఆమె తల్లి వద్దకు వచ్చింది.

సానియా నెల్లూరులోని భర్త వద్దకు వెళతానని చెప్పగా, సమస్య పరిష్కారం కాకుండానే ఎలా వెళ్తావని తల్లి ప్రశ్నించింది. అయినా వినకుండా మంగళవారం నెల్లూరు వెళ్లడానికి సానియా బయలుదేరిన కొద్ది సేపటికే సాజిదా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మౌలానా బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గోదావరిఖని వన్​టౌన్​ ఎస్ఐ  శ్రీనివాస్​ తెలిపారు.