ఇంత కిరాతకం ఏంటి తల్లీ : ఇద్దరు పిల్లలను నరికి చంపి.. అమ్మ ఆత్మహత్య

ఇంత కిరాతకం ఏంటి తల్లీ : ఇద్దరు పిల్లలను నరికి చంపి.. అమ్మ ఆత్మహత్య

హైదరాబాద్: ఇంత దారుణమా.. ఇంత కిరాతకమా.. ఏంటీ ఘోరం.. కొన్ని కొన్ని సంఘటనలు తెలిసినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. హైదరాబాద్ సిటీలో 2025, ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఘోరం తెలిస్తే అందరికీ కన్నీళ్లు వస్తున్నాయి.. ఇద్దరు కన్న బిడ్డలను.. వేట కొడవలితో.. ఇంట్లోనే నరికి చంపిన తల్లి.. ఆ తర్వాత అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన కలకలం రేపింది. ఎందుకింత ఘోరం.. ఎందుకింత కిరాతకం అనే ఆలోచనలు అందరినీ కలిచి వేస్తున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలోని బాలాజీ లేఅవుట్లో ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది తేజస్వీని రెడ్డి అనే మహిళ. అయితే.. ఏమైందో తెలియదు కానీ గురువారం (ఏప్రిల్ 17) ఉన్నట్టుండి ఇద్దరు పిల్లలు ఆశిష్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను వేట కొడవలితో దారుణంగా నరికి చంపింది తల్లి తేజస్వీని. అనంతరం ఆమె బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

►ALSO READ | కేరళలో దారుణం.. షాపు యజమాని తాగి న్యూసెన్స్.. ఫిర్యాదు చేసిందని మహిళ సజీవ దహనం

హుటాహుటిన వచ్చిన పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పిల్లలను వేట కొడవలితో అత్యంత కిరాతకంగా ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది..? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కుటుంబ కలహాలా లేకా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను హత్య చేసి తేజస్వీని ఆత్మహత్యకు పాల్పడటంతో అపార్ట్‎మెంట్ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో తేజస్వీని ఫ్యామిలీతో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. కాగా,  ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.