ఈ తల్లి కష్టాలు.. పగోళ్లకు కూడా వద్దు.. ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో స్టీరింగ్

ఈ తల్లి కష్టాలు.. పగోళ్లకు కూడా వద్దు.. ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో స్టీరింగ్

27 ఏళ్ల మహిళ..  ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే ఆ మహిళ  తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది.  చంటిపిల్లతో ఆటో నడుపుతూ బతుకు పోరాటం చేస్తున్న  ఆమె కథ ఇప్పడు నెట్‌లో వైరల్‌గా మారింది.

బిడ్డల కోసం తల్లి చాలా కష్టపడుతుంది. తన కడుపు నిండకపోయినా, తన బిడ్డల ఆకలి తీర్చాలని అనుకుంటుంది. తాజాగా ఓ తల్లి చేతిలో పసి బిడ్డను పెట్టుకొని, జీవించడం కోసం కష్టపడుతోంది. నెలల బిడ్డను వడిలో పెట్టుకొని జీవనోపాధి కోసం ఆటో రిక్షా నడుపుతోంది. ఆమె పడుతున్న కష్టాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది కాస్త వైరల్ గా మారింది. ఆమె పడుతున్న కష్టానికి నెటిజన్ల హృదయం కరిగిపోయింది.

పిల్లలని ఎత్తుకుని.. తల్లులు పనిచేసుకోవడం.. కొత్తేం కాదు. పసిబిడ్డలను చంకలో ఎత్తుకునో.. నడుముకు కట్టుకునో అమ్మలు చకచకా పనులు చేసేస్తుంటారు. బహుశా అమ్మకు మాత్రమే తెలిసిన విద్య అది. అయితే కాలం మారే కొద్దీ... మహిళలు అన్ని రకాల పనులు చేయాల్సి వస్తుంది. డెలివరీ ఏజెంట్ నుంచి కలెక్టర్ వరకూ అన్ని రకాల పనులు చేస్తున్నారు. చాలా వరకూ ఎండల్లో తిరుగుతూ బయటకు పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయాల్లో కూడా తల్లులు.. తమ పిల్లలతోనే ఎంతో చాకచక్యంగా పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు  ఓ అమ్మ తన బిడ్డను ఒడిలో పెట్టుకొని .. రోజూ ఆటో రిక్షా నడుపుతూ..  చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది.

ఈ- రిక్షా డ్రైవర్‌గా ఉన్న తల్లికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్ చేశారు. మహిళ తన వాహనంలో కూర్చొని కస్టమర్‌లతో బేరసారాలు సాగిస్తున్నట్లు వీడియోలో చూపించారు.. నిశితంగా పరిశీలిస్తే  ఆమె ఒడిలో ఒక చిన్న పిల్లవాడు కనపడతాడు. ఈ వీడియోకు టన్నుల కొద్దీ . వ్యూస్ కూడా లక్షల్లో లైక్ లు  వచ్చాయి. “క్యాప్షన్ అవసరం లేదు, అమ్మ” అనే క్యాప్షన్‌తో పాటు వీడియో షేర్ చేయబడింది. ఆమె పడుతున్న కష్టానికి, ఆమె తల్లి మనసుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె పాదాలకు నమస్కారం చేసినా తప్పులేదు అని కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ :గృహ హింస కేసు: మహమ్మద్ షమీపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ క్లిప్‌పై సోషల్ మీడియా వినియోగదారులు భావోద్వేగానికి గురయ్యారు. కామెంట్ సెక్షన్‌లో చాలా రియాక్షన్‌లు వచ్చాయి. ఈ మహిళ యొక్క అచంచలమైన స్ఫూర్తిని చూసినందుకు చాలా గర్వంగా ఉందని చాలా మంది వ్యాఖ్యానించారు. మరికొందరు ఆ మహిళ కోసం తమ హృదయం ఎలా పగిలిపోయిందో పంచుకున్నారు. “ఈ లేడీకి సెల్యూట్. చాలా గర్వంగా ఉంది,” అని ఒక వినియోగదారు రాశారు.  "ఈ వీడియో చూసిన తర్వాత నా గుండె పగిలిపోయింది..." అని ఒక కామెంట్ చేశారు.  ప్యూర్ లైఫ్ మే మెహనత్ సే బాధ్ కర్ కుచ్ నహీ. జైసీ భీ పరిస్తితి హో అచే దిన్న్ హో యా ఖరాబ్ దిన్ సిర్ఫ్ మెహనత్ కర్తే రహో (జీవితంలో కష్టపడి పనిచేయడం కంటే గొప్పది ఏదీ లేదు. పరిస్థితులు ఏమైనప్పటికీ, మంచి రోజులు వచ్చినా, చెడు రోజులు వచ్చినా, అలాంటిదే ఒకటి ముందుకు సాగుతుంది)" అని ఒక వినియోగదారు అని వ్యాఖ్యానించారు. 

ఇదిలా బిడ్డ, తల్లి భద్రతపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఆమె బహుశా సరైన గేర్‌ని కలిగి ఉండాలని కొందరు వ్యాఖ్యానించారు. "ఆమె బిడ్డను ఆమెతో .. కొంతమంది ఇతర వ్యక్తులతో ప్రమాదంలో పెట్టడం.. శిశువును తీసుకువెళ్లడానికి సరైన గేర్‌ను అందించాలి” అని ఒకరు కామెంట్ చేశారు.  ఇంక, చాలా మంది ఆమెకు వీలైనంత సహాయం చేయాలని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని కామెంట్స్ చేయడం విశేషం. మహిళ వివరాలు తెలిస్తే, తాము ఆర్థిక సహాయం చేస్తామని చాలా మంది ముందుకు రావడం విశేషం.  

https://www.instagram.com/reel/CuV2Hp7KhgN/?utm_source=ig_embed&amp%3Butm_campaign=loading