
మెదక్ (నిజాంపేట), వెలుగు: కొడుకు పెండ్లి కావడం లేదనే మనోవేదనతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన గుడ్ల లక్ష్మి, శంకరయ్య దంపతులకు ఒక్కడే కొడుకు రంజిత్(25). ఇతని పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్ సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు. కానీ ఒక్క సంబంధం రాకపోవడంతో లక్ష్మి సోమవారం రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
మంగళవారం ఉదయం లేచి చూసే సరికి ఇంట్లో కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గ్రామంలో వెతుకుతుండగా మల్క చెరువులో లక్ష్మి(50) డెడ్‌బాడీ దొరికింది. మృతురాలి భర్త శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు