మానవత్వం.. మంటగలిసింది.. నవమాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాశీపూర్ లో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బషీరాబాద్ మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన అంజిలమ్మ (55)ను కన్న కొడుకు చిన్న వెంకటేశం ఇటీవల సొంతూరుకు వచ్చాడు.
ఈ క్రమంలో తాను చేసిన అప్పుల గురించి.. అప్పులు ఇచ్చిన వారికి సమాచారం ఇచ్చిందని కోపంతో రగిలిపోయి.. కన్న తల్లి అని కనికరం లేకుండా గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తల్లి మృతదేహాన్ని సంచిలో మూట కట్టి కాశీపూర్ శివారులోని వాగులో పడేశాడు. ఈ ఘటన గ్రామంలో సంచనణంగా మారింది. మరో కుమారుడు తన తల్లి కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.