అగర్తల: త్రిపుర రాష్ట్రంలోని గాంధీగ్రామ్ టౌన్ లో నివసించే సంఘమిత్ర దేబ్ కు 15 ఏండ్లకే పెండ్లయింది. పెండ్లయిన ఏడాదికి టెన్త్ కంప్లీట్ చేసి, 77 శాతం మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఆమె చదువును కొనసాగించింది. అప్పటికే ఓ కొడుకు పుట్టినా కాలేజీలో చేరింది. కష్టపడి చదివిన సంఘమిత్ర.. త్రిపుర ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో 92.6 శాతం మార్కులతో టాప్ టెన్ లో నిలిచింది. ‘‘ఇంటి పనులు, నా కొడుకు బాగోగులు చూసుకున్న తర్వాత చదువుకునేదాన్ని. ఈ రిజల్స్ట్ తో నేను సంతోషంగా ఉన్నాను. ఇదే విధంగా డిగ్రీ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను” అని సంఘమిత్ర చెప్పారు. ప్రస్తుతం సంఘమిత్రకు 19 ఏండ్లు కాగా, ఆమె కొడుకుకు రెండున్నరేండ్లు. ఆమె భర్త రాజు ఘోష్ బీఎస్ఎఫ్ జవాన్. పెండ్లయినా పట్టుదలతో చదివి, మంచి మార్కులు తెచ్చుకున్న సంఘమిత్రను ఇప్పుడందరూ ప్రశంసిస్తున్నారు.
For More News..