
హైదరాబాద్ లో ఇద్దరు కొడుకులను నరికి చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.. కూతురికి విషం ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆదివారం ( ఏప్రిల్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నాలుగేళ్ళ కూతురికి విషం ఇచ్చి.. తానూ కూడా తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తల్లికి చికిత్స అందిస్తున్నారు.
ఆరోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు కారణమని తెలిపారు బాచుపల్లి పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | హైదరాబాద్ లో దారుణం: స్కూటీపై వెళ్తుండగా కత్తితో దాడి.. వ్యక్తి స్పాట్ డెడ్..