
అత్తాకోడళ్ల మధ్య వివాదాలు సర్వసాధారణం.అలాంటి గొడవలు ఎంత ప్రమాదకరంగా మారతాయో హైలైట్ చేసింది ఈ ఘటన. కోర్టుముందే వీరావేశంతో రెచ్చిపోయి తన్నుకున్నారు అత్తాకోడళ్లు.కుటుంబ సభ్యులతో కలిసి ఒకరిపై పిడిగుద్దులతో విరు చుకుపడ్డారు. ఈ ఘర్షణ చేసేవాళ్లను దిగ్భ్రాంతికి గురిచేసింది.చివరికి పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను విడదీసేదాక తన్నుకుంటూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
#WATCH | Nashik: Mother-in-Law and Daughter-in-Law Clash Outside Court, Chaos Ensues#NashikNews #Maharashtra #viralvideo pic.twitter.com/MyXdsvTHRw
— Free Press Journal (@fpjindia) February 21, 2025
మహారాష్ట్రలోని నాసిక్ లో కోర్టుముందే అత్తాకోడళ్లు పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. వీరి భీకర యుద్దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్తాకోడళ్ల మధ్య కక్ష ఇంతలా ఉంటుందా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. అత్తాకోడళ్ల యుద్దం ప్రారంభంలో అక్కడే ఉన్న కొంతమంది పోలీసులు,న్యాయవాదులు జోక్యం చేసుకోవడానికి బదులుగా ప్రేక్షకులుగా చూస్తూ ఉండిపోయారు. ఇక రెండు వర్గాలు బాగా కొట్టుకొని, ఒకరి బట్టలు ఒకరు చించుకున్న తర్వాత జోక్యం చేసుకున్నారు. కోర్టు ఆవరణలో జరిగిన ఈ ఫ్రీస్టైల్ గొడవతో అక్కడ చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియోలో కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దూషించుకోవడం, కొట్టుకోవడం, గొడవ సమయంలో ఒకరిపై ఒకరు కూర్చోవడం, కిండపడటం వంటి దృశ్యాలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఈ గొడవలో సమీపంలో పార్క్ చేసిన స్కూటర్ కిందపడిపోయింది.
అత్త, కోడలు మధ్య వివాదాలు సర్వసాధారణం..కానీ ఈ సంఘటన అలాంటి గొడవలు ఎంత ప్రమాదకరంగా మారతాయో ఈ ఘటన హైలైట్ చేసింది. చివరికి పోలీసు లు జోక్యం చేసుకుని రెండు వర్గాలపైనా చర్యలు తీసుకునేదాక పోయింది. రెండు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.