గుండెపోటుతో అత్త మృతి మృతదేహం వద్ద ఏడుస్తూ కోడలు మృతి

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా గుట్ట మండలం దాతరుపల్లి పంచాయతీ పరిధిలోని గొల్లగుడిసెలులో ఒకేరోజు అత్తాకోడళ్లు చనిపోవడంతో విషాదం అలుముకొంది. గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ(65) కూలీ పనులు చేసేది. ఈమెకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు భార్య మంగమ్మ. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భారతమ్మ శనివారం తన తల్లిని చూడడానికి భువనగిరి మండలం రాయగిరికి వెళ్లింది. ఆదివారం ఉదయం గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆమె డెడ్​బాడీని గొల్లగుడిసెలుకు తీసుకువచ్చారు. అత్త మృతదేహాన్ని చూసిన కోడలు మంగమ్మ(26) కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహం పక్కనే కుప్పకూలింది. దీంతో ఆమెను వెంటనే భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా  మార్గమధ్యలో మృతి చెందింది.