సంక్రాంతి పండుగ అంటేనే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరినాథుల కీర్తనలు, పిండి వంటలకు ఫేమస్. ఇక ఏపీలో జరిగే సంక్రాంతి సెలబ్రేషన్స్ వేరే లెవల్. ఇందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు అయితే ఇక అంబరాన్నంటుతాయి. కుటుంబమంతా ఒక్కచోట చేరి ఎంతో సంతోషంగా పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే.. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లకు అత్తగారింటి వారు చేసే మర్యాదలు అన్నిఇన్నీ కావు. పండిక్కి వచ్చిన అల్లున్ని ఖుష్ చేసేందుకు అత్తింటివారు రాచమర్యాదలు చేస్తారు. ఏ విషయంలోనూ తేడా రాకుండా చూస్తారు.
మరీ ముఖ్యంగా తిండి విషయంలోనైతే ఇక చాలు పొట్ట పగలిపోయేలా ఉందనే వరకు పెడుతూనే ఉంటారు. వేర్వేరు వంటకాలు తినలేక ఉబ్బసం వచ్చేలా పెడతారు. ముర్కులు, పల్లీ గారెలు, పులిహోర, బగర, సకినాలు బియ్యం పిండితో చేసిన తీపి పదార్ధాలు, నువ్వుల లడ్డు, అరిసెలు, కజ్జికాయలు వంటి డిఫరెంట్ ఐటెమ్స్ వడ్డిస్తారు. ఏపీలో ఉన్న ఈ ట్రెండ్ తెలంగాణకు పాకింది. సంక్రాంతి పండక్కి హైదరాబాద్‌కు వచ్చిన అల్లుడికి అత్తింటి వారు 130 వేర్వేరు వంటకాలు వడ్డీంచి తెలంగాణ రుచి చూపించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నివాసి అయిన మల్లికార్జున్ హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన యువతిని నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత మొదటిసారి సంక్రాంతి పండక్కి హైదరాబాద్ సరూర్ నగర్‌లోని అత్తగారింటికి వచ్చాడు. పెళ్లి తర్వాత తొలి సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చిన అల్లుడికి తెలంగాణ అత్తగారు రాచమర్యాదలు చేశారు.
ALSO READ | తెలంగాణ కిచెన్ : ఈ సంక్రాంతికి మన వంటకాలు
ఏపీ తరహాలోనే వందల సంఖ్యలో వేర్వురు వంటకాలు వడ్డించి అల్లుడ్ని షాక్‌కు గురిచేశారు. అల్లుడి కోసం దాదాపు 130 వంటకాలతో కూడిన భారీ విందును సిద్ధం చేశారు. తెలంగాణ వంటకాలకు చెందిన విభిన్న రుచులను పండుగ వేళ ఓ పట్టు పట్టాడు ఆంధ్ర అల్లుడు. పెళ్లి అయిన తర్వాత తొలి సంక్రాంతిని అత్తగారు లైఫ్ లాంగ్ గుర్తిండిపోయేలా చేయడంతో అల్లుడు ఆనందంలో మునిగిపోయాడు. పండక్కి వచ్చిన అల్లుడికి ఆంధ్ర స్టైల్లోనే తెలంగాణ అత్తగారు మర్యాదలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి తెలంగాణకు చెందిన ఆంధ్ర అల్లుళ్లు ఖుష్ అవుతున్నారు.