భర్త కిడ్నీలు పాడై.. పోషణ భారమై..15 రోజుల బిడ్డను చంపిన తల్లి 

భర్త కిడ్నీలు పాడై.. పోషణ భారమై..15 రోజుల బిడ్డను చంపిన తల్లి 

శంషాబాద్, వెలుగు: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి అలీనగర్ కాలనీలో 15 రోజుల పసికందును కన్నతల్లే చంపినట్లు పోలీసులు తేల్చారు. తమిళనాడుకు చెందిన మణి–విజ్జి దంపతుల పాప రెండు రోజుల క్రితం బకెట్​లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తల్లి విజ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో.. తన భర్త రెండు కిడ్నీలు పాడయ్యాయని, కుటుంబ పోషణ భారంగా మారడంతో పాపను తానే బకెట్లో ముంచి, చంపినట్లు ఒప్పుకుంది. పోస్ట్​మార్టం రిపోర్ట్ లోనూ పసికందు నీటిలో మునిగి, చనిపోయినట్లు తేలిందని సీఐ నరేందర్ తెలిపారు.  మృతురాలి తల్లి విజ్జిని అరెస్ట్​ చేసినట్లు పేర్కొన్నారు.