ఓ మైనర్ కుర్రాడు మద్యం మత్తులో పోర్స్చే కారులో స్పీడ్ గా వెళ్లి బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లో చనిపోయారు. ఈ కేసును మైనర్ బాలుడి కుటుంబం తారుమారు చేయాలని ప్రయత్నించింది. విచారణ చేస్తున్నా కొద్దీ ట్విస్టులు బయటపడుతున్నాయి. శనివారం మైనర్ బాలుడి తల్లి శివాని అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
యాక్సిడెంట్ జరిగిన సమయంలో అబ్బాయి డ్రింక్ చేసి లేడని నిరూపించడానికి బాలుడి బ్లడ్ శాంపిల్స్ కు బదులుగా అతని తల్లి రక్తం నమోనా ఇచ్చారు. దీంతో కేసు ఇన్వెస్టెగేషన్ తప్పుదారిపట్టింది. నిందితుని కుటుంబం బాగా డబ్బున్న వారు కావున కేసు నుంచి బాలుడిని తప్పించడానికి చాలామందిని ప్రలోభపెట్టటారు. ముంభై పోలీసులు ఈకేసును సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాదు అరెస్ట్ అయిన 15 గంటల్లోనే నిందితునికి బెయిల్ ఇవ్వడంపై కూడా తీవ్ర ఆంధోలనలు వచ్చాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ చేసింది బాలుడు కాదని, వాళ్ల డ్రైవర్ అని క్రియేట్ చేసినందుకు నిందితుని తాత, తండ్రిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేశారు.
మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్, తాత సురేంద్ర అగర్వాల్‌లకు శుక్రవారం పూణే కోర్టు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తాజాగా ఈ కేసులో నేరస్తుని తల్లిని సాక్ష్యాలు తారుమారు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.