నల్గొండ అర్బన్, వెలుగు: మానసిక సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు సూచించారు. మంగళవారం ప్రపంచ మానసిక దినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో రామగిరిలో ఉన్న మదర్ థెరిస్సా భవన్ లో మానసిక రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యం మానవ హక్కు అని స్పష్టం చేశారు. మానసికంగా దృఢంగా ఉంటేనే ఏదైనా సాధిస్తామని చెప్పారు. ఐఎంఏ నీలగిరి అధ్యక్షురాలు డాక్టర్ అనితా రాణి, డాక్టర్లు విశ్వ జ్యోతి, అనూష, విశ్వాంక్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని
ఒత్తిడిని జయించాలి
విద్యార్థులు ఒత్తిడిని జయించి ముందుకు సాగాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ సిచ్. రవికుమార్ సూచించారు. ఎంజీ వర్సీటీ , సహాయం కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మానసిక ఆరోగ్య దినోత్సవానికి చీఫ్ గెస్టుగా హాజరై మాట్లడారు. పెరుగుతున్న టెక్నాలజీ, మత్తు పదార్థాల వినియోగం, సెల్ ఫోన్ అడిక్షన్‌తో ప్రజలు మానసిక రుగ్మతలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాయామం, యోగా, మెడిటేషన్‌తో మానసిక ఆరోగ్యం పొందవచ్చని సూచించారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ అంజిరెడ్డి, ఐ క్యుఏసీ డైరెక్టర్ కౌతా శ్రీదేవి, ప్రిన్సిపాల్ అన్నపూర్ణ, సహాయం కోఆర్డినేటర్ శ్వేత, లక్ష్మీ ప్రభ, రామచందర్ గౌడ్, ప్రశాంతి, మచ్చేందర్ పాల్గొన్నారు.