- తల్లిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు
సొంత తల్లే తన మూడేళ్ల పాపను ఎలుగబంటిపైకి విసిరేసిన భయానక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉజ్బెకిస్థాన్ లో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల పాపను తీసుకొని ఓ మహిళ ఉజ్బెకిస్థాన్ లోని జూకి వచ్చింది. జనం చూస్తుండగానే తన కూతురును 16 అడుగుల కింద ఉన్న ఎలుగుబంటి డెన్ లోకి విసిరేసింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఎలుగుబంటి ఆ పసిపాప వద్దకు చేరుకుంది. అక్కడ గుమిగూడిన జనం ఊపిరి బిగపట్టి ఏం జరుగుతోందనే భయంతో చూస్తున్నారు. పాప వద్దకు వచ్చిన ఎలుగుబంటి ఏడుస్తున్న పాపపై తల పెట్టి వాసన చూసింది. ఎలుగుబంటికి ఏమనిపించిందో ఏమోగానీ ..ఆ పసిపాపను ఏం చేయకుండా వదిలేసింది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తమైన జూ సిబ్బంది డెన్ లోకి దూకి పాపను అక్కడి నుంచి పైకి తీసుకొచ్చారు. గాయాల పాలైన ఆ పసిపాపను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప తల్లిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కన్నతల్లి కసాయిలా ప్రవర్తించినా..పసిపాపను వదిలేసిన ఎలుగుబంటి 'జూజూ' పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇవి కూడా చదవండి..