7నెలల పాపను వెయ్యి రూపాయలకు అమ్మకం పెట్టిన తల్లి

7నెలల పాపను వెయ్యి రూపాయలకు అమ్మకం పెట్టింది ఓ తల్లి. ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. భార్యా భర్తలు కొట్లాడుకోగా.. మనస్థాపానికి గురైన భార్య ఏకంగా తన 7నెలల కూతురిని వరంగల్ బస్టాండులో అమ్మకానికి పెట్టింది. విషయం తెలుసుకున్న స్థానికులు తల్లిని జనగామజిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా. ఆ మహిళను పోలీసులు విచారించారు. గత20 రోజులుగా పాప ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ లో చూయించడానికి వరంగల్ కు తీసుకొచ్చానని తెలిపింది. అయితే తల్లిని అనుమానించిన పోలీసులు పాపను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.