డిచ్పల్లి, వెలుగు: డిచ్పల్లి మండల వైస్ ఎంపీపీ శ్యాంరావుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సోమవారం ఎంపీడీవో ఆఫీస్లో ఆర్డీవో రాజేంద్రకుమార్ అవిశ్వాస సమావేశం నిర్వహించారు. మండలంలో మొత్తం 17 మంది సభ్యులుండగా సమావేశానికి 11 మంది కోరం ఉంటే సరిపోతుంది.
13 మంది ఎంపీటీసీలు సమావేశానికి అటెండ్ కావడంతో ఓటింగ్నిర్వహించారు. 13 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఈ నెల 8న ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానం నిర్వహించాలని 12 మంది ఎంపీటీసీలు ఆర్డీవో కి లేఖ అందజేశారు. అవిశ్వాసంపై ఎంపీపీ గద్దె భూమన్న హైకోర్టును ఆశ్రయించగా కోర్ట్స్టే విధించింది. దీంతో కేవలం వైస్ ఎంపీపీపైనే అవిశ్వాస తీర్మానం నిర్వహించారు.