కామేపల్లి సొసైటీ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

కామేపల్లి, వెలుగు  : కామేపల్లి పీఏసీఎస్​ వైస్ చైర్మన్ కాట్రాల రోశయ్య పై డైరెక్టర్లు శనివారం అవిశ్వాస తీర్మానం పెట్టారు. కామేపల్లి సొసైటీ  ఖమ్మం డీసీవో  మురళీధర్ రావుకు తీర్మాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ చైర్మన్ తీర్థాల చిదంబరావు రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్ రోశయ్య కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. 

దానికి నిరసనగా ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెటినట్లు చెప్పారు. త్వరలో ఎన్నిక నిర్వహించి సొసైటీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పదిమంది సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.