కేసీఆర్ అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉందన్నారు మోత్కుపల్లి నర్సింలు. ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం యాదాద్రి లక్షీనరసింహస్వామిని దర్శించుకున్న మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. బతికినంత కాలం కేసీఆర్ సారథ్యంలోనే ఉంటానన్న మోత్కుపల్లి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయమన్నారు.
30 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా లేని ఏకైక వ్యక్తినన్నారు మోత్కుపల్లి. ప్రతిపక్ష పార్టీ నేతల ప్రేమ పొంది వారితో ఓట్లు వేయించుకున్న వ్యక్తిని కూడా తానేనన్నారు.. పేదొడి మనసు గెలిచిన వాడికి ఓటమి లేదని... ప్రతీ పార్టీలో తన అభిమానులు ఉన్నారని చెప్పారు. నరసింహులు మాట ఇస్తే నూటికి నూరుశాతం పని అయినట్లేనన్నారు. 30 సంత్సరకాలంగా 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రతీ ఇంటిలో తాను ఉన్నానని చెప్పారు.