
ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు.. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ తరుపున టికెట్ ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ తిరిగి సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటుగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు.