Motorolo తన Moto G Power 5G (2024) స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల చేయనుంది. ఇది 2023వెర్షన్ కు అప్ గ్రేడ్ చేసిన వెర్షన్ ను వస్తోంది. ఈ ఫోన్ కు సంబంధించిన అడ్వాన్డ్స్ ఫీచర్లు..డిజైన్ తదితర వివరాలు లీకయ్యాయి. MSPowerUser నుంచి నివేదిక ప్రకారం..Moto G Power 5G(2024) రెండర్లను లీక్ చేసింది. ఈ ఫోన్ నీలం, లేత గోధుమ రంగు షేడ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఔటర్ స్పేస్ , ఆర్కిడ్ టింట కలర్ వేస్ గా విక్రయించబడే అవకాశం ఉంది. ఈ ఫోన్ 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 120Hz ఫుల్ HD+ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.
Moto G Power 5G (2024) ఫ్లాట్ 6.7 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 167.3mmx8.5mm సైజులో ఉంటుంది. ఈ ఫోన్ వెనక భాగంలో ప్యానెల్ ఎగువ ఎడమ మూలలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ తో వైట్, సిల్వర్ కలర్ వేలో ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఇది LED ఫ్లాష్ యూనిట్ తో పాటు డ్యూయెల్ రియర్ కెమెరాల యూనిట్ తో కనిపిస్తుంది.
Moto G పవర్ 5G డిస్ ప్లే పై భాగంలో సెంటర్ అలైన్డ్ హోల్ పంచ్ స్లాట్, స్లిమ్ సైడ్ బెజెల్స్ ఉంటుంది. కుడి అంచున వ్యాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటుంది. దిగువ అంచులో స్పీకర్ గ్రిల్, USB టైప్ సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉన్నాయి. వెనక ప్యానెల్ లో ఎగువ ఎడమ మూలలో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్ తో తెలుపు, వెండి వేరియంట్లలో వస్తుంది. LED ఫ్లాష్ యూనిట్ తో పాటు డ్యూయెల్ వెనక కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది.
అయితే Moto G Power 5G(2023) స్మార్ట్ ఫోన్.. 6.5 అంగుళాల 120hz పూర్తి HD+(1080x2400పిక్సెల్ ) LCD ప్యానెల్, 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 10 W ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది దాని 6GB+256GB ధర రూ. 24,500 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది.
అయితే Moto G Power 5G(2024) ధరను మోటోరోలా వెల్లడించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసే అవకాశం ఉంది.