మీ బడ్జెట్లో స్మార్ట్ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

మీ బడ్జెట్లో స్మార్ట్ఫోన్ కావాలా.. Moto G85పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

మోటోరోలా..ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ బెస్ట్ ఫోన్లలో ఒకటైన మోటో G85 5G స్మార్ఫోన్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డివైజ్ అద్భు తమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ పాపులర్ ఈ కామర్స్ ప్లాట్ఫాం ఫ్లిప్కార్ట్లో అతితక్కువ ధరకు లభిస్తో్ంది. లాంచ్ చేసినప్పుడు ఈ హ్యాండ్సెట్ ధర రూ.17వేల 999. ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తోంది. ఫ్రెండ్లీ బడ్జెట్ స్మార్ట్ఫోన్ కోసం ఎదురు చూసేవారికి ఈ డివైజ్ మంచి ఎంపిక. ఇక G85 5G స్మార్ఫోన్పై ప్రతేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్చేంజ్ ఆఫర్లు, ఇతర బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. 

G85 5G స్మార్ఫోన్పై స్పెషల్ బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు

ప్రస్తుతం ప్లిప్కార్టులో ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.17వేల 999. ఈ ఫ్లాట్ఫాంలో బ్యాంక్, ఎక్ఛేంజ్ ఆఫర్లు కలిపి తక్కువ ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు,ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు ఈ డివైజ్ రూ.1000 అదనపు తగ్గింపును పొందుతుంది. అదనంగా ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌ల ద్వారా EMI కొనుగోళ్లకు పరికరం రూ.1500 తగ్గింపును పొందుతుంది.
ఫ్లిప్‌కార్ట్లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.12,100 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. 

Moto G85 5G ఫీచర్లు

  • Moto G85 5G స్మార్ట్ఫోన్..120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ P-OLED డిస్‌ప్లే ఉంటుంది. 
  • ఈ హ్యాండ్‌సెట్లో స్నాప్‌డ్రాగన్ 695 Gen3 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.  
  • ఈ డివైజ్ స్టోరేజ్ పరంగా చూస్తే..12GB RAM,512GB స్టోరేజ్ ఉంటుంది. 
  • ఫోటోగ్రఫీ కోసం Moto G85 5G 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ ఉంటాయి. 
  • ఈ హ్యాండ్‌సెట్‌లో 33W ఫాస్ట్ ఛార్జర్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఎక్కువకాలం వినియోగం, ఫాస్ట్ ఛార్జింగ్కు సహకరిస్తుంది.