హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్నరా..? కొందరు హాస్టల్ ఓనర్లకు మూడినట్టే..!

హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్నరా..? కొందరు హాస్టల్ ఓనర్లకు మూడినట్టే..!
  • హాస్టళ్లలో నల్లాలకు మోటర్లు పెట్టి నీటి దోపిడీ..
  • అమీర్ పేట, ఎస్ఆర్​నగర్,దిల్​సుఖ్​నగర్, కూకట్​పల్లిలో ఇదే పని 
  • కమర్షియల్ కాంప్లెక్స్లు, హాస్టళ్లలో మోటార్ల వేట
  • స్పెషల్ ​డ్రైవ్ నిర్వహిస్తున్న వాటర్​బోర్డు 
  • కమర్షియల్​ బిల్డింగుల్లోనూ డొమెస్టిక్​ కనెక్షన్లు ఉన్నట్టు గుర్తింపు 
  • హాస్టళ్లలో నల్లాలకు మోటర్లు పెట్టి నీటి దోపిడీ
  • అమీర్ పేట, ఎస్ఆర్​నగర్,దిల్​సుఖ్​నగర్, కూకట్​పల్లిలో ఇదే పని

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ‘మోటార్ ఫ్రీ ట్యాప్స్’ పేరుతో అపార్ట్​మెంట్లు, ఇండ్లల్లో స్పెషల్​డ్రైవ్​నిర్వహిస్తున్న వాటర్​బోర్డు అధికారులు తాజాగా కమర్షియల్ కాంప్లెక్సులు, హాస్టళ్లను కూడా తనిఖీ చేస్తున్నారు. కూకట్పల్లి, సమతానగర్, మాదాపూర్, నారాయణగూడ, ఎస్ఆర్​నగర్, అమీర్​పేట, మధురానగర్, అడ్డగుట్టలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి మోటార్లు పెట్టి నీళ్లను గుంజుతున్న వారిని గుర్తించారు. మోటార్లను సీజ్​చేశారు. కొందరు రూల్స్కు విరుద్ధంగా కమర్షియల్ ​కనెక్షన్ను డొమెస్టిక్​ కనెక్షన్​ పేరిట నడిపిస్తున్నట్టు గుర్తించారు. ఈ కనెక్షన్లకు మోటర్లను బిగించి నీళ్లను తోడుతున్నట్టు తెలుసుకున్నారు.

ఇండ్లల్లో హాస్టళ్లు.. డొమెస్టిక్ ​కనెక్షన్లు
ఎస్ఆర్​నగర్, అమీర్ పేట, దిల్​సుఖ్​నగర్, కూకట్​పల్లి తదితర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఇటీవల వాటర్​బోర్డు అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొందరు ఇండ్లను హాస్టళ్లుగా మార్చి, డొమెస్టిక్​కనెక్షన్లతోనే నీటిని వాడుతున్నట్లు గుర్తించారు. నీళ్లు సరిపోకపోవడంతో ఆ కనెక్షన్లకు మోటార్లను బిగించి తోడుకోవడం చూసి అధికారులు అవాక్కయ్యారు. కొందరిపై కేసులు నమోదు చేశారు. ఇండ్లలో హాస్టళ్లు నిర్వహిస్తున్న కొందరు నీళ్లు సరిపోక.. రోజుకు మూడు వాటర్​ట్యాంకర్లు బుక్​చేస్తున్నారు.  

లోప్రెషర్​సమస్యలపై 12 వేల ఫిర్యాదులు
మెట్రో వాటర్​బోర్డు కస్టమర్​కేర్​కు నాలుగు నెలలుగా లో ప్రెషర్​పై విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఈ ఫిర్యాదులు 20 శాతం పెరిగాయి. లో ప్రెషర్​పై ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఏప్రిల్​19 వరకు సుమారు 12 వేల ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎండీ అశోక్​రెడ్డి లో ప్రెషర్​సమస్యపై దృష్టి సారించి మోటార్లు పెడితే సీజ్​చేసి జరిమానాలు విధిస్తున్నారు. ఈ తనిఖీల్లో కొందరు 2 హెచ్​పీ మోటార్లు పెట్టి మరీ నీటిని తోడేస్తున్నట్టు గుర్తించారు. ఐదు రోజుల్లో 134 మోటార్లను సీజ్​చేయడంతో పాటు 164 మందికి జరిమానాలు వేశారు.