రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్లే ఫార్ములా వన్ కార్ రేసింగ్ చూసే ఉంటారు. గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే ఆ రేసింగ్ చూస్తుంటే కలిగే థ్రిల్లే వేరు. ఇప్పుడిలా నేలమీద జరుగుతున్న కార్ రేసింగ్ భవిష్యత్‌లో గాల్లో జరగొచ్చు. కార్లు గాల్లో ఎలా తేలుతాయనేగా మీ డౌట్. వేగంగా దూసుకొస్తున్న డ్రోన్ టెక్నాలజీ ఈ మార్పును తీసుకురాబోతోంది. ఇప్పటికే చాలా నగరాల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌చేసే చాలా వస్తువులు గాల్లో డ్రోన్స్‌తో ఎగిరొస్తున్నాయి. కొన్ని న్యూస్ పేపర్ కంపెనీలూ పేపర్ బాయ్ లేకుండా డ్రోన్స్‌తో డెలివరీకి ప్లాన్ చేస్తున్నాయి. అంటే ఫ్యూచర్ డ్రోన్ టెక్నాలజీదే అన్నమాట. ఇక విషయానికొస్తే ఆస్ట్రేలియాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ డ్రోన్స్ టెక్నాలజీతో తక్కువ ఎత్తులో ఎగిరే ఓ చిన్న సైజు ఎగిరే కార్లను తయారు చేసింది. వీటికి ‘ఎయిర్ స్పీడర్ మార్క్-1’ అని పేరు పెట్టింది.
రెండేళ్లు కష్టపడి దీన్ని డిజైన్ చేశామని, కిందుండి ఆపరేట్ చేసే వీలున్న ఈ ఎయిర్ స్పీడర్ ఎటువంటి పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు దీని తయారీలో కీలకంగా వ్యవహరించిన టెక్ అండ్ స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్ మ్యాట్ పియర్సన్. కేవలం ఎగిరే కారునే తయారు చేయడం చాలా ఈజీ అని, ఫార్ములా వన్ కార్ మాదిరిగా గాల్లో దూసుకెళ్లే డ్రోన్ కారును తయారు చేయడానికి ఇంత టైం తీసుకున్నట్టు చెప్పాడు. ఇందులో లిథియం ఐరన్ బ్యాటరీ వాడామని, ప్రస్తుతం ఈ ఎయిర్ స్పీడర్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందన్నారు. దీని బాడీ అల్యుమినియం, తేలికైన ఉడ్‌తో ఫ్రేమ్ చేశామన్నారు. 50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్ వాడినట్టు చెప్పారు. ఫ్యూచర్‌లో ఎయిర్‌స్పీడర్‌ను ఫార్ములా వన్ కారు, ఫైటర్ జెట్ కంటే వేగంగా వెళ్లేలా తయారు చేస్తామన్నారు. గాల్లో ఎగిరినప్పుడు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా ఎయిర్‌స్పీడర్‌కు సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఇవి ఒకదానికొకటి దగ్గరకొచ్చినప్పుడు ఆటోమేటిగ్గా ఎయిర్‌బ్యాగ్స్ ఓపెనైపోతాయి. ఎయిర్ స్పీడర్స్‌కు పైలెట్లు కూడా ఉంటారు. కిందుండి రిమోట్‌తో దిశ మార్పడం, స్పీడ్ పెంచడం చేస్తారు. గెలుపోటములు మిషన్, టెక్నాలజీ మీద కాకుండా పూర్తిగా వీళ్లు చేతుల్లోనే ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఎయిర్ రేస్‌ను 2020-–21లో నిర్వహిస్తారు.