హైదరాబాద్ లో ఘరానా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసిన బైకుల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 15 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కు తరలించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన గోళ్లపుడి చంటి (38), షాదనర్ కు చెందిన పతల్ వత్ గోపాల్ నాయక్ (36), జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కొరకు గత కొంతకాలంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసిన బైకులను దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తెలింది. గొల్లపూడి చంటి వద్ద నుండి 13 ద్విచక్ర వాహనాలు, గోపాల్ నాయక్ వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వీరిపై పలు దొంగతనం కేసులు ఉన్నట్లు మల్కాజిగిరి ఇన్చార్జ్ డిసిపి గిరిధర్ తెలిపారు.