మామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై మొక్కుబడి సూచికలు!

మామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై మొక్కుబడి సూచికలు!

ఖమ్మం, వెలుగు ఫొటోగ్రాఫర్ : ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై నుంచి రోడ్డుపై రెండు వైపులా వెళ్లే వాహనాల మధ్య గ్యాప్ పెంచేందుకు మిడిల్ పోల్స్ ను ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు మొక్కుబడిగా ఏర్పాటు చేసి చేతులెత్తేశారు. ఒకవైపు రామన్న పేట, మరోవైపు ఎఫ్ సీఐ గోడౌన్ వైపు వెళ్లే మార్గం నుంచి ఎలాంటి సూచికలు లేకుండా పాతిన మిడిల్ ఫోల్స్ ను రాత్రి వేళలో వాహనదారులు గమనించక తొక్కేస్తున్నారు. ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సూచికలు ఏర్పాటు చేసి మిడిల్​పోల్స్​ కొత్తగా పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.