ప్రజలపై మాంజా పంజా..

సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ, పండుగ సందర్భంగా ఎగరవేసే పతంగుల వల్ల మనుషులతోపాటు పక్షులకూ హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. గత  పదిరోజుల నుంచి చాలాచోట్ల  ద్విచక్ర వాహనంపై వెళ్లే  వాహనదారులు,  బాటసారులు కూడా  చైనా మాంజా తగిలి ప్రమాదానికి గురి అవుతున్నారు.  

మాంజాకి  ప్రత్యామ్నాయంగా  దారంతో  పతంగులు  ఎగరవేయవచ్చు. ప్రధానంగా చిన్నపిల్లలు అవగాహన లేకపోవడంతో  చైనా మాంజాను అత్యధికంగా వినియోగిస్తున్నారు.  మాంజా వలన కలిగే  ప్రమాదాల గురించి వారికి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి.

ఎవరికీ ఎటువంటి  ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.  మాంజాను  వాడడం వలన చిన్నపిల్లలతోపాటు పెద్దవారు గాయపడుతున్నారు.  పక్షులు  తీవ్రగాయాల పాలవుతున్నాయి. 

పర్యావరణానికి  కూడా ఈ మాంజాలతో ముప్పు ఉందని ‘ఇంటర్నేషనల్ హ్యూమన్ సొసైటీ పీపుల్ ఫర్ యానిమల్’ అనే  స్వచ్చంధ సంస్థ  ప్రతినిధులు తెలియజే స్తున్నారు.  

మాంజా  అమ్మకాలను  ప్రభుత్వం నిషేధించడం  హర్షణీయం.  సంక్రాంతి  సందర్భంగా  మాంజా  విక్రయాలు జరగకుండా,  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.

-నల్ల అనిల్ కుమార్,ఉస్మానియా యూనివర్సిటీ