
ఢిల్లీ: ఫ్లిప్ మొబైల్ ఫోన్ల మోటోరోలా పెద్దఎత్తున డిస్కౌంట్ ప్రకటించింది. కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఫ్లిప్ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉండనుంది. రేజర్ 40 మొబైల్ ఫోన్లపై రూ.10వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 18 నుంచి 24 మధ్య మోటో డేస్‌లో కొనుగోలు చేసిన వారికి ఈ మొబైల్స్‌పై అదనపు తగ్గింపును అందిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. రేజర్ 40 అల్ట్రా మొబైల్ ఫోన్ రూ.10వేల డిస్కౌంట్‌తో ధర రూ.79,999గా ఉండగా.. దీనిపై రూ.7 వేల అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఈ మొబైల్‌ని రూ.72,999కే కొనుగోలు చేయొచ్చు. ఇక మోటోరోలా రేజర్ 40 మొబైల్‌ని అదనంగా రూ.5 వేల తగ్గింపుతో రూ.44,999కే అందిస్తోంది.