Motorola Edge 50Pro స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. AI సపోర్ట్ తో పనిచేసే కెమెరా సిస్టమ్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ బుధవారం (ఏప్రిల్3) భారత్ లో విడుదలైంది. దీని అమ్మకాలు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతాయి. అద్భుతమైన ఫీచర్లున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం..
Motorola Edge 50Pro స్మార్ట్ ఫోన్లో 12GB RAM, 128 GB స్టోరేజ్ కెపాసిటీ ఇందులో హైలైట్. ఇప్పటికే సేమ్ కాస్ట్ తో మార్కెట్లో ఉన్న వన్ ప్లస్, సామ్ సంగ్ వంటి ఇతర పోటీ స్మార్ట్ ఫోన్లతో పోల్చినప్పుడు ఇది ప్రీమీయం ఫీచర్లను అందిస్తుంది.
Motorola Edge 50Pro ధర, రకాలు:
Motorola Edge 50Pro స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ లలో లభిస్తోంది.
- 8GB RAM, 256GNB Storage
- 12GB RAM, 256GNB Storage
8GB RAM, 256GNB Storage కలిగి ఉన్న Motorola Edge 50Pro స్మార్ట్ఫోన్ ధర రూ.31,999కాగా.. 12GB RAM, 256GNB Storage తో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 35,999. ఈ హ్యాండ్ సెట్ మూడు కలర్లలో లభిస్తోంది. బ్లాక్ బ్యూటీ, మూన్ లైన్ పియరల్స్, లక్స్ లావెండర్ కలర్లతో సెల్ ఫోన్ ప్రియులకు అందుబాటులోకి వస్తుంది.అంతే కాకుండా ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 2వేల రూపాయల అదనపు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇది ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.
Motorola Edge 50Pro ఫీచర్లు
Motorola Edge 50Pro స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాలు స్క్రీన్, 1.5K కర్వ్డ్ AMOLED డిస్ ప్లే HD + రెజల్యూషన్ తో అద్బుతమైన విజుబులిటీ ఉంటుంది. ట్రూ కలర్ పంచ్ హోల్ డిజైన్, అualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో వస్తోంది. స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ లో మృదువైన లెదర్, క్వాలిటీ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది.4500mAh బ్యాకప్ బ్యాటరీ, 125W ఫాస్ట్ ఛార్జింగ్ USB Cకి సపోర్ట్ చేస్తుంది. 8GB RAM వేరియంట్ లో 68 W ఛార్జింగ్ కెపాసిటీ ఛార్జర్ కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ డివైజ్ 50W వైర్ లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ ఫంక్షనాలిటీలను అందిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతోంది. కెమెరా విషయానికి వస్తే..50 MP మెయిన్ కెమెరా, OIS షూటర్, 3X జూమ్ తో 10MP టెలీఫోటో షూటర్, 13 MP అల్ట్రా వైడ్ షూటర్ కెమెరాలతో బ్యాక్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీలకోసం ఫ్రంట్ లో 50MP ఫ్రంట్ షూటర్ ఉంటుంది.
సరసమైన ధర, ప్రీమియం ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ మంచి పనితీరును కోరుకునే తెలివైన స్మార్ట్ ఫోన్ యూజర్లను ఇట్టే ఆకర్షిస్తోంది.