మోటోరోలా కంపెనీ తన ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గురువారం (ఫిబ్రవరి 15) Moto G04 స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఆకర్షణీమైన ప్రీమియం డిజైన్, సరసరమైన ధరల్లో,లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. అత్యంత సరసమై ఆండ్రాయిడ్ 14 స్మార్ట్ ఫోన్ గా moto G04 వినియోగ దారు లకు అవసరమైన ఫీచర్లపై రాజీపడకుండా అత్యాధునిక టెక్నాలజీని అందిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ కనెక్టివిటీ ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా లభిస్తుంది.
మోటో G04 ధర, లభ్యత
- మోటోరోలా Moto G04 స్మార్ట్ ఫోన్ సిరీస్ ని కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, సాచిన్ బ్లూ, సన్ రైస్ ఆరేంజ్ కలర్లతో విడుదల చేసింది.
- గీతలు పడకుండా మాట్ టెక్ట్సటర్ తో అక్రిలిక్ గ్లాస్ (PMMA) ఫినిషింగ్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
- రెండు మెమోరీ, స్టోరేజీ వేరియంట్లతో మోటో G04 లభిస్తుంది.
- 4GB RAM+64 GB స్టోరేజీ, 8GB RAM+128GB స్టోరేజీ తో వస్తుంది.
- వీటి ధరలు వరసగా రూ.6,249, రూ. 7,999.
- ఫిబ్రవరి 22,2024 నుంచి ఈ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ , Motorola.in , ప్రముఖ రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
Moto G04 ప్రత్యేకతలు
- 6.6 అంగుళాల డిస్ ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్ , కెమెరా కటౌట్తో వస్తుంది.
- పరిసరాల కాంతికి తగ్గట్టుగా కలర్, బ్రైట్ నెస్ ను ఈ కెమెరాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు.
- ఈ స్మార్ట్ ఫోన్ లో స్పష్టమైన, బెస్ట్ సౌండ్ కోసం డాల్బీ అట్మాస్ స్పీకర్లు ఉన్నాయి.
- OS లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14 తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.
- ఇది భద్రత, యాక్సెస్ పరంగా కస్టమర్లు తన డివైజ్ కస్టమైజ్ చేసుకునే ఫీచర్లు ఉన్నాయి.
- మోటో G04 లో రెండు 4GB RAM, 8GB RAM అందుబాటులో ఉన్నాయి. వీటిని 16 GB వరకు పెంచుకోవచ్చు.
- UNISOC T606 చిప్ సెట్ , UFS 2.2 స్టోరేజ్ లు ఈ స్మార్ట్ ఫోన్ ను వేగవంతం చేస్తాయి.
- 64GB or 128 GB అంతర్గత స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనిని మైక్రో ఎస్డీ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.
- ఈ స్మార్ ఫోన్ లో మూడు సిమ్ కార్డుల కోసం స్లాట్ ఉంటుంది.
బ్యాటరీ, కెమెరా
- Moto G04 .. 5000 mAh కలిగి ఉంది. 15 W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
- ఇది 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- AI టెక్నాలజీలో ఈ కెమెరాలో అద్భుతమై ఫొటోలను తీయొచ్చు.
- HDR, పోట్రియేట్ మోడ్, టైం లాప్స్, నైట్ విజన్ , లెవెలర్ వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.