హైదరాబాద్, వెలుగు: - స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ లూబ్రిజోల్ కార్పొరేషన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు120 ఎకరాల స్థలాన్ని కొనుగోలుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రకటించింది. ప్రాజెక్ట్ తొలి దశలో సుమారుగా 200 మిలియన్ డాలర్ల పెట్టుబడిని (దాదాపు రూ.1,674 కోట్లు) పెట్టనుంది.
ఇది భారతదేశంలో కంపెనీకి అతిపెద్ద పెట్టుబడి అని, ఈ ప్లాంట్ ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి రెండవ అతిపెద్ద తయారీ కేంద్రం అవుతుందని లూబ్రిజోల్తెలిపింది. లూబ్రిజోల్ అడిటివ్స్ ప్రెసిడెంట్ ఫ్లావియో క్లిగెర్ మాట్లాడుతూ, ఐదు దశాబ్దాలుగా భారతదేశంలో భారీగా ఇన్వెస్ట్ చేశామని అన్నారు.