జనవరి 29 మౌని అమావాస్య: ఆ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

జనవరి 29 మౌని అమావాస్య:  ఆ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

హిందువులు.. పండుగలకు.. వ్రతాలకు పూజలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ప్రతి నెల అమావాస్య తిథి వస్తుంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్యను ( జనవరి 29) మౌని అమావాస్య అంటారు.  ఆ రోజు చాలా పుణ్య తిథి... పుణ్య నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.  అసలు మౌని అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటించాలి.. ఏఏ పనులు చేయాలి.. ఏమేమి చేయకూడదో తెలుసుకుందాం. . . 

మౌని అమావాస్య ( జనవరి 29)  రోజున చేయాల్సిన పనులు..

  • పవిత్ర నదుల్లో పుణ్య స్నానం చేసి.. సూర్య నమస్కారాలు చేయాలి. 
  • దగ్గరలో కృష్ణ, గోదావరి ఇలాంటి పుణ్య నదులు ఉంటే  నదీతీరంలో స్నానం చేయడం మంచిది
  • అవకాశం లేకపోతే ఇంటిదగ్గరే పంపు దగ్గర కాని.. నుయ్యి ( బావి) వద్ద కాని స్నానం చేయాలి.
  • అపార్ట్​ మెంట్​ కల్చర్​ లో అది కుదరదు కనుక వాష్​ రూంలో స్నానం చేసేటప్పుడు ట్యాప్​ తిప్పుకొని ముందుగా ఆనీటికి నమస్కరిస్తూగంగేచ, యమునేచ,గోదావరీ, సరస్వతీ, నర్మదే సింధు కావేరి,జల అస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠించి స్నానం చేయాలి. సబ్బు కాని.. షాంపో కాని వాడకూడదు. 
  • శ్రీహరి.. లక్ష్మీదేవి.. గంగామాతను పూజించి.. హారతి ఇవ్వాలి.
  • శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి.. శివుడికి రుద్రాభిషేకం చేయాలి.
  • కాలభైరవుడిని పూజించాలి. 
  •  ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి.
  • అవకాశం ఉంటే మౌన వ్రతం పాటించాలి.
  • మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది
  • తరువాత పితృదేవతలకు వారి పేర్లు చదువుతూ మూడుసార్లు  నువ్వులు.. నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి. 
  • ఓం పితృ దేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
  • ఉపవాస దీక్షను ఆచరించాలి. దానం ఇవ్వాలి. 
  •  సాయంత్రం తులసి దగ్గర  ఆవు నెయ్యి దీపం వెలిగించాలి.
  • మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానం, ధనం, బట్టల వంటి వాటిని దానం చేయండి
  • మౌని అమావాస్య రోజున భగవంతునని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి. అవకాశం ఉంటే   ఆరోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుని అనుగ్రహం పొందుతారు. 

హిందూ పురాణాల ప్రకారం కాకి,  జలంలో ఉండే జీవరాసులు.. అగ్ని,  గోమాతను పూర్వీకులకు సంబంధించినదిగా భావిస్తారు. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దలను తలుచుకుంటూ కాకి పిండం అని సంభోదించి కాకులకు ఆహారం పెడతారు.  మౌని అమావాస్య రోజున ( జనవని 29) కొన్ని ప్రత్యేక ఆహారాలు తయారు చేసి పెట్టాలి. ఒకవేళ కాకులు లేకపోతే దగ్గరలో చెరువులు కాని.. నదులు కాని ఉంటే వాటిలో కలుపుతారు.  అది కూడా అందు బాటులో ఆవుకు పెట్టడం కాని.. అగ్నిలో ఇతం చేయడం కాని చేస్తుంటారు.  మౌని అమావాస్య రోజున పితృ దేవతలకు నువ్వులు ..నీళ్లు కలిపి తర్పణాలు వద్దలడం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు  శని దేవుడు, శివయ్య అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

హిందూ పురాణాల ప్రకారం,   ఇలా చేయడం వల్ల  అలాగే . అందుకే ఈరోజున పొరపాటున కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు.  ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది.

మౌని అమావాస్య రోజు ( జనవరి 29) చేయకూడని పనులు..

  • జనవరి 29న స్నానం చేసేంత వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు.  మౌని అంటే మౌనం అని అర్దం 
  • సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి...కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తరువాత సంకల్పం చెప్పుకోవాలి. 
  • సూర్యోదయం తరువాత నిద్రలేచే వారికి రాక్షస లక్షణాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. 
  • మౌని అమావాస్య రోజు శాంతంగా ఉండాలి.  ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు.. ఎదుటివారు దుర్భాషలాడినా శాంతంగా సమాధానం చెప్పాలి. 
  • ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు.  అనవసరంగా మాట్లాడకూడదు.  చాలా మితంగా మాట్లాడాలి. 
  • పేదలను, నిస్సహాయంగా ఉండేవారిని అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల మీరు శని దేవుని ఆగ్రహానికి గురవుతారు
  • మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు, స్మశానవాటికల వద్దకు వెళ్లకూడదు. 
  • అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గరకు వెళ్లవద్దు.. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూలశక్తులు ఉంటాయి. 
  • మౌని అమావాస్య రోజున  (జనవరి 29) మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే, వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి.