పనాజీ: బాలీవుడ్, టీవీ నటి మౌనీ రాయ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు సూరజ్ నంబియార్ ను గురువారం ఆమె పెళ్లి చేసుకుంది. గోవాలోని ఓ రిసార్ట్ దీనికి వేదిక అయ్యింది. మలయాళీ సంప్రదాయంలో నిర్వహించిన ఈ వేడుకకు.. వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివాహ ఫొటోల్లో మౌనీ రాయ్ ఎరుపు, తెలుపు రంగు చీర ధరించగా.. సూరజ్ గోధుమ రంగు షేర్వాణీలో కనిపించాడు. తమ పెళ్లి ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో అభిమానులు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Congratulations to the beautiful couple! #MouniRoy and #SurajNambiar tied the knot in an intimate ceremony in Goa today. pic.twitter.com/epuIi6VziX
— Filmfare (@filmfare) January 27, 2022
మౌనీ రాయ్ పెళ్లి వేడుకకు ముందు జరిగిన మెహందీ, హల్దీ వేడుకల్లో ప్రముఖ హిందీ నటి మందిరా బేడీ పాల్గొంది. నూతన వధూవరులిద్దరికి పసుపు పూసి పవిత్ర స్నానం చేయించింది. అయితే మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి వేడుకను తొలుత దుబాయ్ లో జరపాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కానీ దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అతిథులకు ఇబ్బందులు కలగొచ్చనే ఉద్దేశ్యంతో గోవాలో పెళ్లి తంతును నిర్వహించాలని నిర్ణయించారని తెలుస్తోంది. ముంబయిలో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
మరిన్ని వార్తల కోసం: