సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ టీమ్ మెంబర్ గా మౌనిక

సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ టీమ్ మెంబర్ గా మౌనిక

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ మెంబర్​గా అంబటి మౌనిక శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 యింక్లైన్ అండర్​గ్రౌండ్​మైన్​లో గత నవంబర్​ లో ట్రైనీగా చేరారు. గతంలో హిందుస్తాన్​జింక్​లిమిటెడ్​సంస్థలో ఆమె రెస్క్యూ ట్రైనింగ్​పొందారు. రామగుండంలోని రెస్క్యూ స్టేషన్​లో రిఫ్రెషనర్​ప్రాక్టీస్​కు అటెండ్​అయ్యారు.

రెస్క్యూ కిట్ ను అందజేసి యాక్టివ్​రెస్క్యూ ట్రైన్డ్​పర్సన్​గా ఆమెను టీంలోకి రెస్క్యూ సూపరింటెండెంట్​మాధవరావు ఆహ్వానించారు. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 యింక్లైన్​కు చెందిన మౌనిక తొలి మహిళా రెస్క్యూ టీం మెంబర్​గా సెలెక్ట్​ కావడం పట్ల సీఎండీ ఎన్​బలరాం, డైరెక్టర్లు డి. సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, జీఎం పర్సనల్​కవితా నాయుడు, ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, మైన్​మేనేజర్​శ్యాంప్రసాద్​ హర్షం వ్యక్తం చేశారు.