అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నడు.. సీఎం రేవంత్ భోళా మనిషి: నాదెండ్ల భాస్కర్ రావు

హైదరాబాద్: మూసీ ప్రక్షాళన సీఎం రేవంత్ చేస్తున్న గొప్ప పని అని, అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్నారని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం రేవంత్ భోళా మనిషి. వయసు కంటే పెద్ద పదవి ఆయనకు వచ్చింది. నేను కులగణనకి వ్యతిరేకం కాదు. పట్టణాల్లో ఎలాంటి సమస్య రాదు. కానీ గ్రామాల్లో సమస్యలు వస్తాయని భావిస్తున్న. పెద్ద కులం, చిన్న కులం అని భేదం లేకుండా బతుకుతున్నారు. 50 పర్సెంట్ లోపల రిజర్వేషన్ ఉండాలని కోర్టులు చెప్తున్నాయి. అంతకు దాటి పెంచాలనుకుంటే కోర్టులు ఒప్పుకోవేమో. గ్రామాల్లో కొంత గందరగోళం రేకెత్తిస్తున్నాయి. మంచిగా ఉన్న వాతావరణం చెదగొడుతున్నట్లు అనిపిస్తుంది. కులగణన దేనికి చేస్తున్నారో ఒక క్లారిటీ అయితే ఎవరు చెప్పలేదు’ అని తెలిపారు.