
కొంతమంది మాట్లాడుతుంటే వారు ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా దూరంగా జరుగుతారు. లేదంటే ముక్కుకు గుడ్డ కట్టుకుంటారు. అలాంటి వారు మాట్లేడప్పుడు వచ్చే వాసన భరించలేక ఇలా చేస్తుంటారు. మనం తిన్న పదార్దాలు పళ్లలో ఇరుక్కుపోయి పాచిగా ఏర్పడి .. బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అలా బ్యాక్టీరియా ఉన్న వారు మాట్లాడేటప్పుడు వచ్చే వాసనను భరించలేం.. అలాంటివారు కీరా దోసకాయతో బ్యాడ్ స్మెల్ కు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. . .
మనం చెడుగా మాట్లాడుతున్నప్పుడు... నలుగురు దూరం జరగడం వేరు, మనం మంచి మాట్లాడుకున్నా దూరం జరగడం వేరు. మొదటి వ్యక్తిత్వానికి సంబంధించినదైతే... రెండోది. ఆరోగ్యానికి సంబంధించినది! అంటే నోటి దుర్వాసన చాలామందిని వేధిస్తోన్న సమస్య. ఇది మనం నలుగురితో కలవడానికి ఇబ్బంది.. పడడమే కాదు ఇతరులు కూడా మనతో మాట్లాడకుండా దూరంగా ఉంటారు. ఇది మానసికంగా మనిషిని కుంగదిస్తుంది.
పొద్దున, సాయంత్రం రెండు పూటల బ్రష్ చేసినప్పటికీ... కొందరు ఈ సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అయితే, ఇది కేవలం బ్రష్ చేసుకొని, మౌత్ వాష్ వాడితే తగ్గే సమస్య కాదు. సాధారణంగా మనం తీసుకునే అన్ హెల్దీ ఫుడ్, జీర్ణాశయ వ్యాధులు, స్మోకింగ్, మందు తాగడంతో పాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల నోరు పొడిబారి నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
ALSO READ | Ugadi 2025: ఉగాది పండుగ ఎప్పుడు ప్రారంభమైంది... తెలుగు సంవత్సరాదిని మొదట ఎవరు జరుపుకున్నారు..
ఈ వేసవిలో ఎక్కువగా లభించే కీరదోసతో దీనికి చెక్ పెట్టొచ్చు. కీరాదోస నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. కీరా ముక్కును తరిగి నోటి పై భాగంలో ముప్పై సెకండ్ల పాటు నాలుకతో అదిమి ఉంచాలి. దీని వల్ల ఫైటోకెమికల్స్ రిలీజవుతాయి. ఇవి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి.
కీరా దోసకాయలో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, సిలు, పోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, జింక్, మెగ్నిషియం, పాస్పరస్, పొటాషియంతో పాటు 95 శాతం నీరు ఉంటుంది. ఎండాకాలంలో కీర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే, నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే.. మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ నోరు పొడిగా మారకుండా జాగ్రత్త పడాలి. భోజనం తరువాత పుక్కిలించడం మర్చిపోవద్దు. ఇలా చేసినప్పుడు పళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఆహారం బయటకు వస్తుంది. దీంతో అది షాచిగా మారదు కాబట్టి, దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు!
–వెలుగు, లైఫ్–