ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు:  రాష్ట్రంలో బహుజన రాజ్యం కోసం ఉద్యమించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకుడు ఉపేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌బీ అతిథి గృహంలో ఆదివారం  నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉపేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా హాజరై మాట్లాడారు. బహుజనుల ఓట్లతో లబ్ధి పొందుతున్న రాజకీయ పార్టీలు వారి సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై దృష్టి సారించా లని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కుంటి సాకులు చెబుతూ రాష్ట్రాభివృద్ధి గాలికి వదిలేశాయని విమర్శించారు. రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎల్ఎఫ్ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్‌‌‌‌, బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గ కన్వీనర్లు దండు జ్యోతి, రాజశేఖర్, కె.మధు, మోసిన్, బి.జగదీశ్, సయ్యద్,హైమద్ హుస్సేన్, బహుజన లెఫ్ట్ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వడ్ల సాయికృష్ణ పాల్గొన్నారు. 

అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలి

బోధన్, వెలుగు: ఎన్ని అడ్డంకులు ఎదురైనా బోధన్‌లో అంబేద్కర్ భవన నిర్మాణం చేపట్టాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని రైస్​మిల్ అసోసియేషన్ భవన్‌లో రౌండ్​ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లడుతూ ఎమ్మెల్యే షకీల్ రూ.కోటితో అంబేద్కర్ భవనం కట్టిస్తానని హామీ  ఇచ్చారని తెలిపారు. ఆయనకు దళిత సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతూ తెలుపుతున్నట్లు  ప్రకటించారు. కొంతమంది కుట్రలు చేసి స్థల వివాదం పేరుతో అంబేద్కర్ భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఆరు నెలలోపు అంబేద్కర్ భవనం నిర్మాణం  పూర్తి చేయడానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్‌‌లీడర్‌‌ రాధాకృష్ణ, కౌన్సిలర్  బెంజర్ గంగారాం, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు  విద్యాసాగర్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్​కమిటీ సభ్యులు రామకృష్ణ, జిల్లా గోసంగి సంఘం అధ్యక్షుడు గంధం రాజేశ్‌, బీసీ సంఘం  నాయకులు నక్క లింగారెడ్డి, రుద్ర సత్యనారాయణ, రజక సంఘం కన్వీనర్ కొన్నె వినోద్, నాయకులు అద్దంకి లింగన్న,  బాలరాజ్, శంకర్, డిస్కో సాయిలు పాల్గొన్నారు. 

పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాలి

కామారెడ్డి, వెలుగు: నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు ప్రధాన సాగు, తాగు నీటి ప్రాజెక్టు అయిన పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచాల్సిన అవసరముందని, ఈ విషయంలో గవర్నమెంట్ చొరవ తీసుకోవాలని పీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ ఎల్లారెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి కోరారు. ఆదివారం ఎల్లా
రెడ్డిలో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..  గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు కోసం పాదయాత్ర చేశారని, ఇప్పుడు అధికారంలో ఉండి ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు, రైతులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా పోచారం ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ప్రాజెక్టు ఆయాకట్టు రైతులను ఏకం చేసి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఎల్లారెడ్డి మండ
ల శాఖ ప్రెసిడెంట్ జనార్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.  

కృష్ణానగర్‌‌‌‌‌‌‌‌లో ఆర్థోపెడిక్ క్యాంప్‌‌‌‌

మాక్లూర్, వెలుగు: మండలంలోని కృష్ణానగర్‌‌‌‌‌‌‌‌లో ఇమేజ్‌‌‌‌ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆర్థోపెడిక్‌‌‌‌ హెల్త్​ క్యాంప్‌‌‌‌కు విశేష స్పందన లభించింది. డాక్టర్ గుడారు జగదీశ్ బృందం శిబిరానికి వచ్చిన  పేషంట్లను పరిశీలించి మందులను అందజేశారు. కొందరిని శస్ర్త చికిత్స కోసం రిఫర్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థోపెడిక్​విభాగంలో వివిధ రకాల వ్యాదులతో బాధ పడే వారిని పరిశీలించి పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సర్జరీలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్మల్, ఆదిలాబాద్‌‌‌‌, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటి వరకు 2,400 మందికి ఆపరేషన్లు చేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్ గుడారు, డాక్టర్ సుంకర దినేశ్‌‌‌‌, సర్పంచ్ అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కొండల్‌‌‌‌రావు, వెంకట్‌‌‌‌రావు, నర్సింహారావు, చిన్నా, బాబ్జీ, శ్రీనివాస్, రంగారావు పాల్గొన్నారు.  

‘కేసీఆర్‌‌ పెద్ద దగాకోరు’

కామారెడ్డి, వెలుగు: ప్రజలను నమ్మించి దగా చేయడం సీఎం కేసీఆర్‌‌కు వెన్నెతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్​అలీ విమర్శించారు. ఆదివారం మాచారెడ్డి మండలం పరిధిపేటలో బీరప్ప కల్యాణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పేరిట గొల్ల కురుమలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల టైంలో గొర్రెల పంపిణీ చేయనున్నట్లు చెప్పి మళ్లీ ఆపేశారన్నారు. వేల మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గొర్రెల పంపిణీ చేయలేదన్నారు. ప్రజల అమయాకత్వాన్ని ఆసరా చేసుకుని కేసీఆర్ ఆటలాడుతున్నాడని మండిపడ్డారు. ధరణి పోర్టల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. తమ పార్టీ  రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వచ్చే  ఎన్నికల్లో కేసీఆర్‌‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. డీసీసీ వైస్​ ప్రెసిడెంట్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, లీడర్లు రమేశ్‌గౌడ్, బీమ్‌రెడ్డి, సందీప్, గొనే శ్రీను, శంకర్‌‌గౌడ్ పాల్గొన్నారు.  

నకిలీ విత్తనాల మోసపోయా

నస్రుల్లాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ పంచాయతీ రాజేశ్‌ తండాకు చెందిన రైతు శంకర్‌‌కు కల్తీ విత్తనాలతో మోసపోయాయని ఆదివారం మీడియా ముందు వాపోయాడు. తన 3 ఎకరాల్లో బాన్సువాడలోని ఓ దుకాణం నుంచి తెచ్చిన మక్క సీడ్‌ వేశానని వివరించాడు. ఎకరానికి రెండు బ్యాగుల (4 కిలోలు) చొప్పున మూడు ఎకరాలకు ఆరు బ్యాగులు తెచ్చి వేశానని, 15 రోజులైనా ఆ విత్తనాలు మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సీడ్ ఇచ్చిన దుకాణావారిని అడిగితే భూమిలోనే సమస్య ఉందని అంటున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 

బీజేపీలో పలువురి చేరికలు

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: కేంద్ర పథకాలకు ప్రజలు ఆకర్షితులై రాష్ట్రంలో భారీ సంఖ్యలో యువత బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ కామారెడ్డి అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. ఆదివారం నిజాంసాగర్ మండల హాసన్‌పల్లి గ్రామంలో బీజేపీ జెండా ఆవిష్కరణ, బూత్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు  అరుణతార చీఫ్‌ గెస్ట్‌గా హాజరు కాగా గ్రామానికి చెందిన 20 యువకులకు పార్టీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం యువతను మోసం చేసి నిరుద్యోగులుగా మార్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రెసిడెంట్ సాయిలు, జిల్లా సెక్రటరీ రాము, లీడర్లు శ్రీకాంత్, రాజు, నరేశ్‌, సాయిరాం పాల్గొన్నారు.