వారానికి ఎన్ని గంటలు పని చేయాలి.. ఎన్ని రోజులు వీక్ ఆఫ్ ఉండాలి..ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్..మొన్నటికి మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ మాట్లాడిన మాటలు ఉద్యోగుల్లో మంట పుట్టించాయి. వారానికి 90 గంటలు..80 గంటలు పని చేయాలంటూ సూచించారు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఏకంగా పెద్ద బాంబ్ పేల్చాడు. వారానికి 120 గంటలు పని చేయాలని.. వీకెండ్ పని చేసేవాళ్లను సూపర్ పవర్గా అభివర్ణించాడు మస్క్.
ఐదు రోజులు..వారానికి 40 గంటలు పని చేస్తున్న బ్యూరోక్రాట్స్ లావుగా ఉంటున్నారని.. వీకెండ్ పని చేసే వాళ్లు సూపర్ పవర్ గా ఉంటున్నారంటూ కామెంట్స్ చేశారు ఎలన్ మస్క్..వారానికి 120 గంటలు అంటే.. ఏడు రోజులపాటు రోజుకు 17 గంటలు పని చేయాల్సి ఉంటుంది.. ఇది సాధ్యమేనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.
అమెరికా డిపార్టుమెంట్ ఆప్ ఎఫిషియెన్సీ బాస్ గా బాధ్యతలు చేప్టటిన ఎలాన్ మస్క్ వెంటనే ఈ ప్రకటన చేశారు. వచ్చీరాగానే ఎలాన్ మస్క్.. ప్రభుత్వంలోని బ్యూరోక్రాట్లపై పడ్డారు. బ్యూరోక్రాట్లు వారానికి 40 గంటలు పనిచేయడం వల్ల చాలా లావయ్యారు.. చాలా మంది బ్యూరోక్రాట్లు వారాంతంలో పనిచేయడం లేదు.. వారాంతంలో పనిచేస్తే సూపర్ పవర్ గా ఉంటారని కామెంట్స్ చేస్తూ X లో పోస్ట్ చేశారు. దీంతో అటు ప్రతిపక్షం అయిన డెమొక్రాట్లు, రాజ్యాంగ పండితుల నుంచి ఆందోళనకు దారితీసింది. ఇక నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
ALSO READ | అమెరికా గెంటేసిన భారతీయులు 205 మంది:యుద్ధ విమానంలో ఇండియాకు
ఈ పోస్ట్ పై మిశ్రమ స్పందనలు వచ్చాయి.. ఒక యూజర్ ఎలాన్ మస్క్ ను భయంకరమైన బాస్ అని సంబోధించాడు.. మరొక యూజర్ స్పందిస్తూ.. ఉద్యోగులు వారంలో 120 గంటలు పని గంటలు పెడితే DOGE(డిపార్టెమంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ) మొత్తం ఖాళీగా ఉందని అన్నారు.
ఇంకో నెటిజన్ స్పందిస్తూ..ఇప్పుడు రెండు వారాంతపు సెలవులతోపాటు మరో రెండు రోజులు సెలవులు తీసుకొని రోజుకు 24 గంటల పనిచేస్తారని పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్ తనను తాను గొప్పగా చూపించుకునేందుకు ఏదైనా చెబుతాడు అని విమర్శించారు.
ఏదీ ఏమైనప్పటికీ మొన్నటికి మొన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ అండ్ టీ చైర్మన్ వారానికి 90 గంటలు..80 గంటలు పని చేయాలంటూ సూచిస్తే ఇప్పుడు ఎలన్ మస్క్ వారానికి 120 గంటలు పని చేయాలని అంటున్నారు. అంటే ఏడు రోజులపాటు రోజుకు 17 గంటలు పని చేయాల్సి ఉంటుంది.. ఇది సాధ్యమేనా అంటూ ఎలాన్ మస్క్ ప్రకటనపై అటు అమెరికా ప్రతిపక్ష నేతలు, ఇటు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.