పొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం 

పొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం 

మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి గ్రామ పెద్ద చెరువులో మొసలి సంచారం కలకలం రేపింది. యాసంగి వరినాట్లు వేసేందుకు కొందరు మహిళా కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లారు. పని పూర్తైన తర్వాత కాళ్లకు అంటిన బురదను కడుక్కునేందుకు పెద్ద చెరువు వద్దకు వెళ్లగా.. నీళ్లలో నుంచి ఒక్కసారిగా మొసలి కనిపించడంతో భయంతో ఒడ్డుకు పరుగులు తీశారు. వర్షాకాలం వరద నీటికి పాకాల చెరువు నుండి పెద్ద చెరువులోకి మొసలి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం వేళలో మొసలి ఒడ్డుకు వస్తుండడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనలో ఉన్నారు.