
- దళితుల అభ్యున్నతి కోసం భాగ్యనగర్ పత్రికను భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించారు.
- ఆది హిందువుల చేతివృత్తుల నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి భాగ్యరెడ్డి వర్మ 1925లో చేతివృత్తుల ప్రదర్శనను నిర్వహించారు.
- 1927లో అలహాబాద్‌లో జరిగిన అఖిల భారత నిమ్నవర్గాల సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ దక్షిణ భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు.
- 1927 నుంచి 1931 వరకు జరిగిన జాతీయ నిమ్నవర్గాల సభలకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించాడు.
- లండన్‌లో జరిగే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత ప్రతినిధిగా అంబేద్కర్‌ను పంపాలని 1931 లక్నోలో జరిగిన జాతీయ నిమ్నవర్గాల సదస్సు తీర్మానించింది.
- 1931 లక్నోలో జాతీయ నిమ్నవర్గాల సదస్సులో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని డిమాండ్ చేసింది.
- హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వద్ద ఆది హిందూ భవనాన్ని భాగ్యరెడ్డి వర్మ సొంతంగా స్థాపించారు.
- పంచములు, అవర్ణులు, మాల, మాదిగ, డక్కలి, సింధూ పేర్లతో కూడా తమనకు ఆది హిందువులు అనే పేరుతో పిలవాలని నిజాం ప్రభుత్వాన్ని భాగ్యరెడ్డి వర్మ కోరారు.
- 1931 జనాభా లెక్కల్లో నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా నమోదు చేసింది.
- జంతుబలికి వ్యతిరేకంగా భాగ్యరెడ్డి వర్మ జీవదయ ప్రచార సభ స్థాపించింది.
- 1925లో కలరా, ప్లేగ్ వ్యాధులు విజృంభించినప్పుడు భాగ్యరెడ్డివర్మ ఆరోగ్య సేవాదళ్ స్థాపించారు.
- భాగ్యరెడ్డి వర్మ చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు వర్మ అనే బిరుదు బాజి కిషన్ రావు అనే బిరుదు ఇచ్చాడు.
- ఆదివాసీ ప్రాంతాల్లోకి నిజాం, బ్రిటిష్ ప్రభుత్వాలు 18వ శతాబ్దం నుంచి జోక్యం చేసుకోవడం ప్రారంభించాయి.
- నిజాం ప్రభుత్వం 1844లో మైనింగ్ కోసం హైదరాబాద్ నుంచి పాల్వంచ వరకు రైల్వే మార్గాన్ని నిర్మించింది.
- చాందా – బలార్షా మధ్య రైల్వే లైను నిర్మాణం 1924లో జరిగింది.
- హైదరాబాద్ – పాల్వంచ, చాందా– బలార్షా రైల్వే లైన్ల నిర్మాణం వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి ఆదివాసేతర ప్రజలు భారీగా వలస వెళ్లి, ఆదివాసీ ఆస్తులు ఆదివాసేతరుల అధీనంలోకి వెళ్లాయి.
- నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలతో కూడిన ఆసిఫాబాద్ ప్రాంతాన్ని రాజ్‌గోండులు పాలించారు.
- రాజ్‌గోండులు పాలించిన ఆసిఫాబాద్ ప్రాంతాన్ని అప్పట్లో జనగావ్ అని పిలిచేవారు.
- నిజాం రాజు 1853లో జనగావ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాడు.
- బ్రిటిష్, నిజాం సైన్యం దాడులకు వ్యతిరేకంగా రాంజీగోండ్ నాయకత్వంలో గోండులు ఎదురు తిరిగారు.
- రాంజీ నాయకత్వంలో గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం కల్నల్ రాబర్ట్‌కు అప్పజెప్పింది.
- రాంజీగోండ్, అతని 1000 మంది సహచరులను కల్నల్ రాబర్ట్ బంధించి 1857 ఏప్రిల్ 9న ఉరి తీశాడు.
- రాంజీ గోండ్ సహా 1000 మందిని నిర్మల్ వద్ద ఉరి తీసిన మర్రిచెట్టు వెయ్యి ఉరుల మర్రిగా ప్రసిద్ధి చెందింది.
- నిజాం అధికారులు, జాగీర్దార్లు అకృత్యాలను భరించలేక జాగీర్దార్ సిద్ధిఖీని కొమరం భీం చంపేశాడు.
- జాగీర్దార్ను హత్య చేసి అనంతరం కొమరం భీం అసోం వెళ్లిపోయాడు.
- అసోం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొమరం భీమ్ జల్, జంగల్, జమీన్ నినాదం ఇచ్చాడు.
- కొమరం భీం గెరిల్లా సైన్యాన్ని జోడేఘాట్ అటవీ ప్రాంతంలో రూపొందించాడు.
- కోమరం భీమ్ వర్ధంతిని స్థానిక గిరిజనులు దసరా వెళ్లిన మొదటి పున్నమి రోజున జరుపుకుంటారు.
- కోమరం భీమ్ మరణించిన ప్రాంతం జోడేఘాట్
- 1/70 గిరిజన చట్టం రూపకల్పనకు స్ఫూర్తి కొమరం భీమ్ పోరాటం.
- కొమరం భీమ్ మరణానంతరం నిజాం గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడానికి ప్రొఫెసర్ సి.ఎఫ్. హైమన్ డార్ఫ్‌ను నియమించింది.