మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి మొగుళ్లపల్లి గ్రామాల మధ్య జరిగిన మినీ మేడారం జాతరలో ఏర్పాటుచేసిన హుండీలను దేవదాయ శాఖ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈనెల 21 నుంచి 24 వరకు జాతర సమయంలో కానుకలు చెల్లించేందుకు సమ్మక్క సారలమ్మ గద్దెలపై ఏర్పాటుచేసిన 9 హుండీలను దేవదాయ శాఖ ఆఫీసర్లు నాగేశ్వరరావు,మైహిపాల్ ఎస్సై మాధవ్ గౌడ్ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఈనెల 28 లేదా మార్చి మొదటి వారంలో హుండీల లెక్కింపు చేపడతామని చెప్పారు. 44 ఏండ్లుగా జరుగుతున్న ఈ జాతరలో హుండీలను పోలీస్ స్టేషన్ కు తరలించడం ఇదే మొదటిసారి.
నల్లబెల్లి, వెలుగు: మద్ది మేడారం జాతరలోని వన దేవతలు జనం నుంచి వనంలోకి ఆదివారం ఉదయం చేరారు. హుండీలను దేవాదాయ శాఖ ఆఫీసర్లు లెక్కించారు. జాతర ఆదాయం మొత్తం రూ.3 లక్షల 38 వేల 432 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతర ట్రస్టు చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీదేవి, పూజారులు సమ్మయ్య, నాగరాజు, హరికృష్ణ, శ్రీనివాస్, సువర్ణలు పాల్గొన్నారు.