నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేత.. ఇక నేను.. నా సినిమాలు

బెంగుళూర్ డ్రగ్స్ కేసు నుంచి సినీ నటి హేమకు ఊరట కలిగింది. డ్రగ్స్ కేసు, రేవ్ పార్టీలో హేమ పాల్గొందని వివాదాస్పదం అయిన కారణంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ విధించింది. తాజాగా హేమ డగ్స్ తీసుకుందా అని పోలీసులు టెస్ట్ చేశారు.. అందులో ఆమెకు నెగిటివ్ వచ్చిందని చెప్తూ హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. బెంగుళూర్ రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. దీంతో MAA అసోసియేషన్ హేమ పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసింది. అలాగే మీడియాతో మాట్లాడవద్దని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమాకు సూచించింది.