లింగ భేదాలపై కొత్త కామెడీతో వస్తున్నాం

ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్ ప్రధాన పాత్రల్లో  ఘంటసాల విశ్వనాథ్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వేణు బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ  ‘మేము కొత్త కామెడీతో ముఖ్యంగా లింగ భేదాలపై మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాం.  

ఇందులో  టెక్నాలజీ  కీలకపాత్ర పోషించబోతుంది. ఈ చిత్రం మాకెంతో చాలా స్పెషల్’ అని చెప్పారు.  డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ ‘డిసెంబర్ 26న షూటింగ్ మొదలుపెట్టి కంటిన్యూగా చేస్తున్నాం. యాభై శాతం షూట్ పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం యూఎస్‌‌కు వెళ్తున్నాం’ అని అన్నాడు.  పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తున్నారు.