
భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, అమిత్ కుమార్ తివారీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రామ్’. ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అనేది ట్యాగ్‌లైన్. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తున్నారు.
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను దర్శకుడు పరశురామ్ రిలీజ్ చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశాడు. దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ చెప్పే డైలాగ్‌తో మొదలైన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.