- సినీ హీరో సుమన్
నల్గొండ అర్బన్, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవాలని సినీ హీరో డాక్టర్సుమన్ సూచించారు. శుక్రవారం రాత్రి మిర్యాలగూడలోని మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్‌లో నల్గొండకు చెందిన స్టూడెంట్లకు నిర్వహించిన కలర్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు.
అనంతరం వారికి బెల్టులను ప్రదానం చేసి మాట్లాడారు. కరాటేతో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతున్నారని చెప్పారు. అనంతరం సుమన్ తల్వార్ షావోలిన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే ఇండియా ఫౌండర్ నాంపల్లి కనకారావుని సన్మానించారు.