హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఓ నిర్మాత హల్చల్ చేశారు. ఓ కేసు విషయమై నిర్మాతను ఓయూ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ పిలిచారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు నిర్మాత.. నన్నే పోలీస్ స్టేషన్కి పిలుస్తావా అంటూ పీఎస్కు వెళ్లి ఇన్స్పెక్టర్పై దాడికి దిగారు. నిర్మాతతో పాటు వచ్చిన అతడి అనుచరులు కూడా ఇన్స్పెక్టర్పై దాడి చేశారు.
నిర్మాత, అతడి అనుచరులు హంగమా చేయడంతో ఓయూ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇన్స్పెక్టర్పై దాడి సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు హుటాహుటిన ఓయూ స్టేషన్కు చేరుకున్నారు. ఇన్స్పెక్టర్పై దాడి ఘటనపై ఆరా తీస్తు్న్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.