మహబూబాబాద్ అర్బన్, వెలుగు: రజాకర్ సినిమా యూనిట్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. లక్ష్మి థియేటర్ లో రజాకార్ సినిమా ప్రదర్శన కొనసాగుతుండగా నటీనటులు గురువారం సందర్శించారు. ముందుగా బయ్యారం సెంటర్కు చేరుకుని రజాకార్ల ద్వారా బాధితులయిన అమరవీర కుటుంబాలను పరామర్శించారు.
తరువాత అక్కడి నుంచి నేరుగా లక్ష్మి థియేటర్ చేరుకొని సినిమా చూశారు. సినిమాను విజయవంతం చేసిన ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నటీనటులు ఇంద్రజ, రాజ్ అర్జున్, బలగం సహదేవ్, గిరి, సత్యనారాయణ, రమణ, శివం, సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో, డైరక్టర్ యాట సత్యనారాయణ తో పాటు ఇతర బృందం పాల్గొన్నారు.