Independence Day 2024 Movies: ఇండిపెండెన్స్ డేకి థియేటర్స్‌లో వస్తోన్న క్రేజీ సినిమాలు..వాటి సెన్సార్స్

స్వాతంత్య్రదినోత్సవం (ఆగస్ట్ 15) సందర్భంగా అదిరిపోయే సినిమాలతో థియేటర్స్‌ కళకళలాడేందుకు రెడీ అవుతున్నాయి.రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, విక్రమ్ తంగలాన్, రామ్ డబుల్ ఇస్మార్ట్, నార్నే నితిన్ అయ్ వంటి తెలుగు సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి మరో రెండు సినిమాలు కూడా పలకరించబోతున్నాయి. మరి ఏ సినిమా ఎలాంటి రేంజ్ తో రానుందనేది తెలుసుకుందాం. 

మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌:

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’(Mr Bachchan). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది. ఇప్పటికే పాటలతో,టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్..ప్రస్తుతం వరుస ప్రమోషన్స్ తో ఆసక్తి పెంచుతున్నారు. 

కామెడీ, రొమాన్స్, యాక్షన్ తో బచ్చన్ ఎంటర్ టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అలాగే జగ్గూభాయ్, రవితేజ మధ్య వచ్చే సీన్స్ థియేటర్స్ లో గూస్బంప్స్ పుట్టిస్తాయని, హీరోయిన్, హీరో మధ్య వచ్చే సీన్స్ అలరిస్తాయని సెన్సార్ నుంచి టాక్ ఉంది. 

మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఎ (U/A) సర్టిఫికెట్‌ను పొందింది. మొత్తం 2 గంటలు 38 నిమిషాల నిడివితో, ఈ మూవీ ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది. 

డబుల్ ఇస్మార్ట్

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌ శంకర్‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌గా నటిస్తున్నాడు.ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రామ్ మాస్ గెటప్‌‌లో ఎనర్జిటిక్‌‌గా కనిపిస్తున్నాడు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.ఫుల్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి (A) సర్టిఫికెట్ లభించింది. 

తంగలాన్‌‌

విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్‌‌’.  పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌‌. కబాలి, కాలా చిత్రాల దర్శకుడు పా.రంజిత్ రియల్ ఇన్సిడెంట్స్‌‌ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగ‌‌ష్టు 15న విడుద‌‌ల కాబోతుంది. కోలార్‌‌‌‌ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌‌ కుమార్‌‌ సంగీతం అందిస్తున్నాడు.  ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి (U/A) సర్టిఫికెట్ లభించింది.

ఆయ్ 

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బావమరిది నార్నే నితిన్(Narne nithin) మ్యాడ్(Mad) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం నార్నే నితిన్ గీత ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 టు బ్యానర్ లో ఆయ్ మూవీ చేశాడు. ఈ మూవీ గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌లో హృద‌యానికి హ‌త్తుకునేలా మ‌న‌సారా న‌వ్వుకునేలా రూపొందిన ఈ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్ష‌కుల‌కు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి.

ఇప్పటికే ఆయ్ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని భారీ సినిమాల మధ్య రానున్న ఆయ్ ఎలాంటి హిట్ కొడుతుందో అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఎ (U/A) సర్టిఫికెట్‌ను పొందింది.

వేదా

జాన్‌ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వేదా’ (Vedaa). నిఖిల్‌ అడ్వాణీ దర్శకుడు. ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను రియల్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి (U/A) సర్టిఫికెట్ లభించింది.  

ఖేల్‌ ఖేల్‌ మే

26సార్లు రీమేక్ అయి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (khel khel mein)గా రాబోతోంది.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌,  తాప్సి, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.